ఎక్కువ మంది కూలీలతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయండి.

Spread the love

Complete house constructions with more workers.

ఎక్కువ మంది కూలీలతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయండి.
*కమిషనర్ అనుపమ అంజలి

జగనన్న కాలనీల్లో ఎక్కువ మంది కూలీలను పెట్టి త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.

ప్రతి శనివారం హౌసింగ్ డే కార్యక్రమంలో భాగంగా చిందేపల్లి లోని జగనన్న కాలనిలో జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.

నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఎక్కువ మంది కూలీలను పెట్టి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, బ్రిక్, గుల్ల, స్టీల్ వంటి వాటిని ముందుగానే లేఔట్ లకు చేర్చుకోవాలన్నారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి అయ్యేలా నిత్యపర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట డి.ఈ. గోమతి, హౌసింగ్, ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page