కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిశీలించిన కమిషనర్

Spread the love

Commissioner who inspected Korlagunta Master Plan Road

కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిశీలించిన కమిషనర్


సాక్షిత : నగరపాలక సంస్థ పరిధిలోని కొర్లగుంట లో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను కమిషనర్ అనుపమ అంజలి పరిశీలించారు.

కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి, అదనపు కమిషనర్ సునీత తో కలసి పనులు పరిశీలించిన కమిషనర్ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొర్లగుంట మాష్టర్ ప్లాన్ రోడ్డు పనులు త్వరగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా టి.డి.ఆర్. ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలని అదనపు కమిషనర్ ను ఆదేశించారు. భవనాల తొలగింపుతో పాటు ఇరువైపులా డ్రైనజీ కాలువల నిర్మాణం కూడా వేగంగా చేయించాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page