SAKSHITHA NEWS

నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చేరిన తలారి సంపత్ కు రూ.13,500/-, తాడుపర్తి శంకర్ కు రూ.60,00/-, వణుకూరు జ్యోతి కి రూ.30,000/-, వి.సత్యవతి కి రూ.60,000/-, సిహెచ్ నరసింహారెడ్డి కి రూ.50,000/-, రంగయ్య కు రూ.60,000/-, నారెడ్డి నరేందర్ రెడ్డి కి రూ. 27,500/- ల చెక్కులు పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలా లబ్ది చేకూరుతుందన్నారు…

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకు అండగా…ఈ ప్రజా పాలన ప్రభుత్వం నడుస్తుందన్నారు..

ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, చాంద్ భాషా, సూర రవీందర్ గౌడ్, ప్రభు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app