
స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి,సమీక్ష
హైదరాబాద్:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించను న్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కసరత్తు చేస్తున్నారు.
ఉదయం 12 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారు లతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదిత రులు పాల్గొన్నారు.
కాగా, సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సంవత్సరం అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఇక, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేచి చూస్తుంది. ఇప్పటికే కమిషన్ రిపోర్టును రెడీ చేశాగా.. ఈ రోజు జరిగే సమావేశంలో నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఆ తర్వాత రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకా శం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈరోజు జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app