సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులపాటు రాజస్థాన్ పర్యటన
హైదరాబాద్:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ కి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లి అక్కడే మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం ఫ్యామిలితో జైపూర్ లో జరిగే బంధువుల పెళ్లి వేడుకలకు హాజరయ్యేం దుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు అధికా రిక వర్గాలు తెలిపాయి.
అక్కడ కార్యక్రమం ముగి సిన అనంతరం వెంటనే ఢిల్లీకి వెళ్లి.. ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు.
దీంతో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయిం ట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గం విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించ నున్నట్టు సమాచారం అందుతుంది.