SAKSHITHA NEWS

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు NRI లు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం అమెరికాకు చేరుకున్న రేవంత్ రెడ్డి టీమ్ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోనూ ఇదే తరహా టైమ్ స్క్వేర్ తరహాలో టి స్క్వేర్ మల్టీపర్పస్ హబ్ ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని రాయదుర్గంలో నిర్మించేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. ఈ హబ్ నిర్మాణంలో హైదరాబాద్ కు గ్లోబల్ వైడ్ గా మరో గౌరవం దక్కనుంది


SAKSHITHA NEWS