SAKSHITHA NEWS

సిఎం శంకుస్థాపన

  • చేయనున్న సమీకృత గురుకుల & 500 పడకల ఆసుపత్రికి దివంగత బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టాలి

సమీకృత గురుకులానికి జయరాములు యాదవ్ పేరు
500 పడకల ఆసుపత్రికి డా.బాలకిష్టయ్య ముదిరాజ్ పేరు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాచాల యుగంధర్ గౌడ్ వినతి
*
సిఎంతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెడతామని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ
ఎమ్మెల్యే స్పందనపై బీసీ నాయకుల హర్షం

సాక్షిత వనపర్తి
మార్చి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే నియోజకవర్గం కేంద్రంలోశంకుస్థాపన చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు మరియు 500 పడకల ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యేలు మూలమాల్ల జయరాములు యాదవ్ మరియు డాక్టర్ ఎ.బాలకిష్టయ్య ముదిరాజ్ పేరు పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి వాటికి మాజీ బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెడతామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి సానుకూలంగా స్పందించడంతో బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app