
ఎడ్లపాడు గ్రామ పంచాయితీలలో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ – స్వచ్చ దివస్.
స్వచ్చ ఆంధ్రప్రదేశ్ – స్వచ్చ దివస్ కార్యక్రమము ప్రతినెల 3వ శనివారము నిర్వహించబడుతుంది. అందులో భాగంగా శనివారం యడ్లపాడు మండలంలో గ్రామ పంచాయితీలలో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా యడ్లపాడు గ్రామ పంచాయితీలో స్వచ్చ కార్యక్రమం మరియు ప్రతిజ్ఞ, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహనా కలిపించడం జరిగినది.ఈ సందర్భంగా ఎంపీడీవో హేమలత దేవి మాట్లాడుతూ పంచాయితీలలో చేత్తకుప్పల తొలగింపు, మురుగు కాలువలు సుభ్ర పరచుట కార్యక్రమములు నిర్వహించడం జరిగినది అని ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు సామజిక భాద్యత కలిగి ఉండాలి. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలి. చెత్త రహిత గ్రామాలుగా రూపొందుటకు భాగస్వాములై సహకరించాలి ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి హేమలత దేవి,పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అధికారులు,అంగన్వాడి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు
