
బీజేపీ పెద్దల మదిలో మెగా స్టార్ చిరంజీవి
చిరంజీవిని ఆకర్షిస్తున్న కమలం పువ్వు?
అమరావతి
రావడం కొంచెం ఆలస్య మైనా రావడం మాత్రం పక్క అంటూ రాజకీయా ల్లొక్చేశారు. అభిమానులే నాకున్న పెట్టుబడి అంటూ ప్రజాజీవితంలో ఎంట్రీ ఇచ్చారు. కానీ.. అంతే స్పీడుగా వెనక్కెళ్లి పోయారు. మెగాస్టార్ చిరంజీవి,అదంతా గతం.
ఆ తర్వాత చిరంజీవికీ.. రాజకీయాలకు బంధం తెగిపోయింది. సినిమాలే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ముందుకు వెళ్తున్న చిరం జీవి.. సెకండ్ ప్రయారిటీ ఫలానా అని చెప్పకుండా అభిమానుల కోరికలను ఆశల పల్లకీలోనే వదిలేశారు.
సినిమాల్లోకి ఎలా ఐతే రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా మొదలు పెట్టారో.. రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీటౌ తుందని, బాస్ ఈజ్ బ్యాక్ ఔతారనేది సగటు మెగాస్టార్ అభిమాని చిరు కోరికగానే ఉంది.
మెగా అభిమానుల్లో ఉన్న ఈ యాస్పిరేషన్లని కొన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకుని చిరంజీవి చరిష్మాకు గాలం వేస్తూనే ఉన్నాయి. కాషాయం పార్టీ ఐతే.. మెగా ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఓరకంట కనిపెడుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ అంటే తొమ్మిది మంది హీరోల బలమైన కూటమి. అందులో పవన్ కల్యాణ్‌కుండే ఫ్యాన్‌బేస్ ఇప్పటికే పరోక్షంగా బీజేపీ కనుసన్నల్లోనే ఉంది.
ఏపీలో బీజేపీతో కలిసి కూటమి కట్టి పవర్లోకొచ్చిన పవన్‌కల్యాణ్… ఆ తర్వాత ప్రధాని మోదీకి బాగా దగ్గరివాడయ్యాడు.డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ వేసే అడుగులన్నీ బీజేపీ భావజాలానికి సింకవడం.. ఆయనిచ్చే సనాతన సౌండ్ బీజేపీ థియరీకి కోరస్‌గా అనిపించడం.. ఈ పరిణామాలన్నిటినీ ఢిల్లీ కమలనాథులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ వ్యూహాత్మక పైచేయి సాధిస్తున్నారన్న విశ్లేషణలు కూడా బీజేపీ నోట్లో నీళ్లూరేలా చేస్తోంది. రేపటిరోజున పవన్ మనోడే అనే ధీమా వచ్చేసింది గనుక.. ఇదే గ్యాప్‌లో మెగా ఫ్యామిలీని పూర్తిగా క్యాప్చ ర్ చేయడానికి పూనుకున్న ట్టుంది కమలం పార్టీ.
ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోదీ ప్లస్ చిరంజీవి.. వీళ్లిద్దరి కాంబినేషనే సెంటరాఫ్ ఎట్రా lక్షన్‌గా మారింది. ప్రధాని హోదాలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న మోదీ.. అదే సందర్భంలో మెగాస్టార్ తో సమానంగా కలిసి నడవ డం ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్ని హిత్యం ఎక్కడిది.. సమ్ థింగ్ సమ్‌థింగ్ అంటూ గుసగుసలు కూడా వినిపించాయి.
ఇక్కడే కాదు.. మెగా ఫ్యామిలీ మోదీ గుడ్‌లుక్స్ లో ఉందని చెప్పడానికి సాక్ష్యాలుగా ఫ్లాష్‌బ్యాక్‌లో బోలెడన్ని దృశ్యాలు. అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా స్పెషల్ ఇన్‌వైటీగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. మూ డేళ్ల కిందట నర్సాపురంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగా యి. ముఖ్య అతిథిగా ప్రధా ని మోదీ హాజరయ్యారు.
అదే వేదికపై ప్రత్యేక ఆహ్వానితుడిగా మెరిశారు మెగాస్టార్ చిరంజీవి.ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మిగతా బీజేపీ పెద్దలు సైతం ఇప్పటికీ మెగా టచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏడాది కిందట తెలంగాణ ఎన్నికల సమయంలో హోమ్ మంత్రి అమిత్‌షా హైదరాబాద్ వచ్చినప్పు డు.. చిరంజీవి, రాంచరణ్ కలిసి ఆయనతో ప్రత్యేకం గా భేటీ అయ్యారు.
ఎజెండా ఏంటన్నది ఇప్ప టికీ మిస్టరీనే. అంతకు ముందు ట్రిపులార్ పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో ఢిల్లీలో అమిత్ షా భేటీ అయ్యారు. అభినందనలు మాత్రమేనా మిగతా మంతనాలేమైనా జరిగాయా? అనే చర్చ అప్పట్లో తెలుగు పొలిటికల్ సర్కిల్స్‌ని వేడెక్కించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార ఘట్టంలో మోదీ చేసిన మెగా ఫీట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
