
తల్లిదండ్రుల ప్రవర్తనపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
సాయంత్రం 125 – గాజుల రామారం డివిజన్ చిత్తారమ్మ నగర్లో నిర్వహించిన ఎస్.పి.ఆర్ గ్లోబల్ స్కూల్” అన్యూవల్ డే కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ… పిల్లల ప్రవర్తన, నడవడిక తల్లిదండ్రుల ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. మనము వారిలో మార్పు కోరుకునే ముందు మనలో మార్పు ఉండాలని, పిల్లలను సెల్ ఫోన్ వాడొద్దని చెప్పే తల్లిదండ్రులు, వారు ముందుగా మొబైల్ ఫోన్లను పక్కకు పెట్టి పిల్లలతో సమయం కేటాయించినట్లయితే వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దవచ్చన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేసిన ఎమ్మెల్యే ని స్కూల్ యాజమాన్యం శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ & చైర్మన్ సొంటి రెడ్డి పున్నారెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ బాయ్, చెట్ల వెంకటేష్, ఆసిఫ్, ప్రసాద్, అజ్జు, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app