SAKSHITHA NEWS

మేడ్చల్ నియోజక వర్గం తూంకుంత మున్సిపాలిటీ శామీర్ పేట్ పరిధిలో ప్రజా పాలన గ్రామసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్,

ప్రభుత్వం ఈనెల 26 నుండి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని రైతులకు నెలకు ₹1000 ఆర్థిక సాయం లాంటి ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలుపరుస్తుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తాం.
ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఇల్లు లేని స్థలమున్న,స్థలం లేని నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా చూడాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్,తూంకుంత మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, ముజీబ్ రుద్దీన్,శామీర్ పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్, కిషోర్ గౌడ్, మహేందర్ యాదవ్,శామీర్పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు