సిసి రోడ్లు మరియు డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా పనులకు అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారుడు పల్లా వెంకట్ రెడ్డి, సలహాదారులు బిక్షపతి చారి, సుదర్శన్ చారి, అధ్యక్షుడు మురళీధర్, ప్రధాన కార్యదర్శి గణేష్, కోశాధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

