SAKSHITHA NEWS

కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందజేత..!!

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కులగణన నివేదిక (Census Report)ను మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు (Officials of the Planning Commission) కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee)కి అందజేశారు.

రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా (Principal Secretary Sandeep Sultania) బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub-Committee)కి కులగణన కు సంబంధించిన నినేధికను ఈ రోజు సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కులగణన నివేదికను అందుకున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన తెలంగాణలో దాదాపు 50 రోజుల పాటు కొనసాగింది. ఈ సర్వేలో దాదాపు 76 ప్రశ్నలతో కూడిన సర్వేను నిర్వహించి రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు (Economic status of the people of the state) పాటు అన్ని వివరాలను సేకరించారు.

ఈ సర్వేలో మొత్తం 3,889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంభాలను అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం తెలంగాణలోని 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కాగా 3.1 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గోనలేదని.. కమిషన్ తన నివేదికలో తెలిపింది. కాగా ఈ కులగణన నివేది (Census report)కపై సోమవారం కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం దానికి ఆమోదం తెలపనుంది. అనంతరం నివేదికను రెడీ చేసి ఈ నెల 5న ఉదయం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Special Session of the Assembly) నిర్వహించి ఈ కులగణన నివేదికను ప్రవేశపెట్టనున్నారు.

అనంతరం కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ (A special discussion in the assembly) నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కోసం ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే చేయించి విజయవంతంగా పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన దిశగా కులగణన సర్వే (Census Survey) నివేదిక ఆమోదంతో ముందడుగు పడనుంది. కాగా ఈ నివేదిక త్వరలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app