
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతం చేయాలి.
ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్.
భవన నిర్మాణ కార్మికుల మొదటి మహాసభ పొట్లూరి నాగేశ్వరరావు భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎండి యూసుఫ్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం ఎఐటియుసి సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించడం వల్ల సిపిఐ నాయకులు ఇంద్రజిత్ గుప్తా,చతురనంద్ మీశ్రా లు గుజ్రాల్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ఉన్న సమయంలో తీసుకొచ్చినటువంటి భవనిర్మాణ సంక్షేమ సంఘం బోర్డును నేడు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి బీమా పథకాలు రాకుండా పోతున్నాయని, అదేవిధంగా గతంలో భవనిర్మాణ కార్మికులను వేలిముద్రలు లేకుండానే గుర్తింపు కార్డులు ఇచ్చేవారని కానీ నేడు వేలిముద్రలు ఖచ్చితమని నిబంధన పెట్టడం వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్రంగా నష్టపోతున్నారని అటు పనులు చేయకుండా ఇటు కార్డులు పొందకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని కావున వెంటనే వేలిముద్రలు అనే నిబంధనను తొలగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం చట్టం రూపొందించడానికి, చట్టాలు భవనిర్మాణ కార్మికులు అందడానికైనా పోరాటం చేసేది కేవలం సిపిఐ,ఏఐటియుసి,ఎర్రజెండాలు మాత్రమేనని నేడు అనేకమంది నాయకులు వ్యక్తిగతంగా సంఘాలు పెట్టుకొని వ్యక్తిగతంగా లాభం పొందడానికే ఉన్నారు కానీ వాళ్ల ఉద్దేశంలో వాళ్ళ నాయకులుగా ఉండి,మిగతా అందరూ కార్మికులుగా ఉండడమే వాళ్లకు కావాలని కానీ సిపిఐ, ఏఐటియుసి మాత్రం కార్మికులే దేశాన్ని ఏలాలని కోరేటువంటి పార్టీలు కాబట్టి భవనిర్మాణ కార్మికులందరూ ఏఐటీయూసీ,సిపిఐ జెండా కింద పనిచేస్తూ ఈ దేశంలో కార్మికుల రాజ్యాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది భవనిర్మాణ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కామ్రేడ్ ఉమా మహేష్ అధ్యక్షులుగా హరినాథ్, కార్యదర్శిగా సాయిలు ఉపాధ్యక్షులుగా బాలాజీ సాయం కార్యదర్శిగా ఓ రాములు ఆర్గనైజింగ్ సెక్రటరీగా తౌరియా కోశాధికారిగా ఆగం రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశానికి ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు స్వామి గారు అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలాజీ,పరమేశ్వర్ భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు సామేల్, రవి, యాదగిరి, శివారెడ్డి, ప్రవీణ్ స్వామి, ఎల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app