
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 71వ పుట్టినరోజు రోజు సందర్బంగా నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 71మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ & కో ఆప్షన్ సభ్యలు
ఆకుపచ్చని ఆవరణ కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం
మొక్కలు నాటండి పర్యావరణాన్ని రక్షించండి
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 71వ పుట్టినరోజు రోజు సందర్బంగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , మాజీ కార్పొరేటర్లు రఘూవేంద్ర రావు, బాలాజీ నాయక్, పెద్ది రెడ్డి సుజాత, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం,చంద్రగిరి జ్యోతి సతీష్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, అభిమానులతో కలిసి 71 మొక్కలు నాటి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం,
ప్రతి పథకం దేశానికి ఆదర్శం, రూపకల్పనలో వినూత్నం, ఆచరణలో అద్వితీయం, అమలులో విప్లవాత్మకం,జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన జాతిపిత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్పితా ప్రకాష్, ఎన్ఎంసి యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా అధ్యక్షులు, యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, వివిధ కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
