బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 (92) మృతి.

Spread the love

బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 (92) మృతి.British Queen Elizabeth-2 (92) passed away.

బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఇక లేరు. ఆమె వయసు 96 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాసల్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరున్న బ్రిటన్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన రాణిగా.. ప్రపంచంలోనే సుదీర్ఘంగా పరిపాలించిన రెండో నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. వేసవి విడిది నిమిత్తం లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాసల్‌కు వెళ్లారు. అక్కడే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. తిరిగి లండన్‌కు రాలేదు. అధికారిక పర్యటనలు, ప్రయాణాలను మానుకున్నారు. ఇటీవల బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ నియామక వేడుకను కూడా బల్మోరల్‌ క్యాసల్‌లోనే నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి. బ్రిటన్‌ పార్లమెంట్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో అత్యవసర బిల్లుల మీద జరుగుతున్న చర్చకు స్పీకర్‌ సర్‌ లిండ్సే హోలీ స్వల్ప విరామం ఇచ్చి.. ఎలిజబెత్‌-2 ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని ఎంపీలకు తెలియజేశారు. ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ అన్నె కొన్ని రోజులుగా తల్లిని చూసుకుంటూ బల్మోరల్‌ క్యాసల్‌లోనే ఉండగా.. కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ చార్లెస్‌, ఆయన భార్య కామిల్లా, మనవడు ప్రిన్స్‌ విలియమ్‌, మిగతా కుమారులు ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడవర్డ్‌ హుటాహుటిన స్కాట్లాండ్‌ చేరుకున్నారు.

Related Posts

You cannot copy content of this page