బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన

Spread the love

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన

కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అవినీతి, కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాం బండారం ఎక్కడ బయటపడుతుందోనని, వారి అవినీతి బాగోతం ప్రజలకు ఎక్కడ తెలుస్తోందననే భయంతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రను ముందుకు సాగొద్దని కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ లకు పూనుకుంది. దీంతో పాదయాత్ర ఆగిపోతుందని టీఆర్ఎస్ సర్కారు భ్రమ పడుతోంది. ప్రజా సంగ్రామ యాత్రకు ఎక్కడైతే అడ్డంకులు సృష్టించారో… అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తాం. వరంగల్ లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించి తీరుతుంది. కేసీఆర్ ప్రభుత్వ బండారాన్ని బయటపెడుతుంది.

Related Posts

You cannot copy content of this page