అమ్మ పరివార్ ఆశ్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Spread the love

BJP state leader Chandrapatla Sunil Reddy’s birthday celebrations at Amma Parivar Ashram

అమ్మ పరివార్ ఆశ్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు

రామగుండం నియోజక వర్గం గోదావరిఖని పట్టణం లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి పిల్లల మధ్య కట్ చేసి అనంతరం ఆశ్రమ పిల్లలకు బుక్స్, పెన్స్, పెన్సిల్ పంపిణి చేసి, అన్న దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆశ్రమ పిల్లల తో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాల ఆనందం గా ఉంది అన్నారు. అనంతరం
ఆశ్రమ నిర్వాహకులు శాలువా తో సునీల్ రెడ్డి కి సన్మానం చేసి, పిల్లలకు స్టేషనరి సామాగ్రి తో పాటు, అన్నదానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం, మహాముత్తారం మండలాల ప్రధాన కార్యదర్శులు పూసల రాజేంద్ర ప్రసాద్, మేడిపల్లి పూర్ణ చందర్, మంథని మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు అరె ఓదెలు, నాయకులు గుమ్మడి శ్రీను, కుర్మ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page