బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయండి
గిరిజన మోర్చా బిజెపి అధ్యక్షులు రామచంద్రనాయక్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో జరగనున్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, మేడ్చల్ జిల్లా రూరల్ గిరిజన మోర్చా బిజెపి అధ్యక్షులు రామచంద్రనాయక్ ఓ ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం గిరిజనులకు అడగడుగునా అన్యాయం చేసిందని తాత ముత్తాతల నుండి సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులపై టిఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భూములు లాక్కున్నారని తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసినప్పటికీ రెవెన్యూ గ్రామ పంచాయతీ కల్పించకపోవడం 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఏకపక్ష ధోరణి, నియంత్రిత, కుటుంబ పాలన, అవినీతి, విముక్తికోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 14వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు.
ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా ముఖ్య అతిథులుగా, విచ్చేస్తున్నారు అని అన్నారు. ఈ భారీ సభను ఉద్దేశించి దీర్ఘకాలంలో గిరిజనులు పోరాటం చేస్తున్న అటవి భూముల సమస్యలపై స్పష్టత గిరిజనులకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్ పై అనుకూలంగా ప్రకటన చేయనున్నారు. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబ సభ్యులు ఈ భారీ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

