0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second

చిన్న పిల్లల అధార్ ను బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోండి – అదనపు కమిషనర్ సునీత

తిరుపతి

చిన్న పిల్లల ఆధార్ కార్డులను బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత మంగళవారం ఓక ప్రకటనలో తెలియజేసారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎంపిక చేసిన కొన్ని వార్డు సచివాలయముల నందు నేడు బుధవారం ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ కార్డు ఎన్ రోల్ మెంటు, బయోమెట్రిక్ అప్ డేషన్, డిమో గ్రాఫిక్ అప్
డేషన్ మొదలగు సర్వీసులు చేయబడునని, చిన్న పిల్లల ఆధార్ ను 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ప్రతి
ఒక్కరూ వారి ఫింగర్ బయోమెట్రిక్ అప్ డేషన్ చేసుకోవాలన్నారు. మధురా నగర్, ప్రకాశం రోడ్డు, రాజీవ్ నగర్ జీవకోన, తాతా నగర్, అంబేద్కర్ కాలనీ, బైరాగిపట్టేడ, జర్నలిస్ట్ కాలనీ, కెనడీ నగర్, మధురా నగర్, తిరుమల రెడ్డి నగర్, శాంతి నగర్ వార్డు సచివాలయముల నందు ఆధార్ సేవలను వినియోగించ కొనవలసినదిగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి సూచనల మేరకు
పుర ప్రజలను కోరడమైనదని అదనపు కమిషనర్ సునీత తెలిపారు.


Spread the love

You cannot copy content of this page