మధిరలో 2 కోర్టు కాంప్లెక్స్ లు, రికార్డ్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీ సుధ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మధిర లో రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2 కోర్టు కాంప్లెక్స్ లు, రూ. 39 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రికార్డ్స్ భవన నిర్మాణ పనులకు శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, ఖమ్మం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి పి. శ్రీ సుధ, హైకోర్టు న్యాయమూర్తులు భీమపాక నగేష్, కాజా శరత్, ఖమ్మం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ న్యాయమూర్తి జి. రాజగోపాల్ లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భవన ప్లాన్ ను న్యాయమూర్తులు పరిశీలించారు. పనులు ప్రారంభించి, అగ్రిమెంట్ తేదీలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తులు అన్నారు.
అనంతరం రిక్రియేషన్ క్లబ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ కోర్ట్ ను న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధిర సీనియర్ సివిల్ న్యాయమూర్తి మీరా ఖాసీం సాహెబ్, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. పుల్లారావు, న్యాయమూర్తులు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, మధిర మునిసిపల్ కమీషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ రాంబాబు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.