భాగ్యలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్యవతి రాథోడ్ ప్రారంభించారు

Spread the love
Bhagyalakshmi Grain Buying Center was inaugurated by Satyavati Rathod.

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, బంగారు చెలిమి తండా గ్రామంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్(ఐ కె సి) ఆధ్వర్యంలో నిర్వహించిన భాగ్యలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..

బిజెపి పై ధ్వజమెత్తిన మంత్రి సత్యవతి రాథోడ్

కేంద్ర బిజెపి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతులకు నష్టం చేస్తుంది.

కొంతమంది సన్నాసి బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు,
డబుల్‌ ఇంజిన్‌ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ, దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది.

బీజేపీ పాలిత హర్యానా, కర్ణాటకలో రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.

కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉన్నంతవరకు రైతులకు ఎలాంటి నష్టం జరగదు.

రైతుల కష్టాలు బీజేపీ కి పట్టవు.

మీకు, మీ పార్టీకి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌ ఇవ్వండి.

రైతులు పండించిన వడ్లను కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి మొత్తుకున్నా కొనడానికి చేతకాని వారు.. వందల కోట్ల రూపాయలు సంచుల్లో పట్టుకొని ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తున్నారు.
ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉంటుందా?

కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ముందుకు వస్తుంది.

గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.

ప్రజా కోర్టు ముందు బీజేపీ నాయకులు దోషులుగా నిలబడబోతున్నారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుంది.

వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శం.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2060,
బీ గ్రేడ్ 2040 రూపాయల, చొప్పున మద్దతు ధర ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలో ఒక్క కేసీఆర్‌ సర్కార్ మాత్రమే రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.

వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఎంపీపీ రాజేశ్వరి, జెడ్పిటిసి జ్యోతిర్మయి, ఎంపీటీసీ సౌజన్య, డిఆర్డిఏ సన్యాసయ్య, ఆర్డీవో రమేష్,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,మరియు సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page