SAKSHITHA NEWS

డయాలసిస్ పేషంట్స్ కు మెరుగైన వైద్యం అందించాలి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి డయాలసిస్ కి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులకు రాకుండా చూడాలని మరియు అక్కడ సౌకర్యాలను గురించి డయాలసిస్ పేషంట్ల ను, కిడ్నీ సంబంధిత పేషంట్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పరికరాల ద్వారా వైద్య సేవలను మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ప్రభుత్వ వైద్యశాలలో సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరు నెలల వ్యవధిలో దాతల సహకారంతో కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య, డాక్టర్ తిరుపతిరెడ్డి, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, హెచ్ డి ఎస్ కమిటీ సభ్యులు, రహిమాన్, బుల్లా బాల బాబు, కోమలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.