
ప్రజలకు మెరుగైన పాలన అందించారు…
ప్రజాసేవకు విరమణ ఉండదు.
పదవి లేకున్నా ప్రజలకు సేవలు అందించాలి.
కోదాడ మున్సిపల్ పాలకవర్గానికి ఘనంగా సన్మానం.
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మున్సిపల్ పాలకవర్గం ముగుస్తున్న సందర్భంగా చైర్మన్ సామినేని ప్రమీల ఆధ్వర్యంలో వారిని శాలువా పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం అన్ని విధాలుగా కృషి చేసిందని గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఎంతో కష్టపడి పనిచేశారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కరోనా మహమ్మారి, ఇటీవల వచ్చిన వరదల్లో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తమ శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పట్టణ ప్రజల మన్ననాలను పొందారన్నారు. ప్రజాసేవకు విరమణ ఉండదు అని పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏవైనా సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి పాలకవర్గ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app