ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు

Spread the love

ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు

సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని. నేరేడుపల్లి గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథకాలతో…
భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి. మరియు వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్. శ్రీమ గండ్ర జ్యోతి రెడ్డి గార్ల. అభివృద్ధి నిధులు, సహాయ సహకారాలతో ….
గ్రామ అభివృద్ధిలో పురోగతిని సాధించి నేడు…
హనుమకొండ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డును సాధించిన శాయంపేట మండలం ,నేరేడుపల్లి *గ్రామ సర్పంచ్ ఆకుతోట రాజేష్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజున శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామ యువ సర్పంచ్ ఆకుతోట రాజేష్ గారిని చీఫ్ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్ గారు మరియు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గార్లు శాలువాతో సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ
నేరేడుపల్లి గ్రామంలో చెత్త సేకరణ, శ్మాశనవాటికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు నిర్ణీత సమయంలో నిర్మించడమే కాకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచడం… గ్రామీణ అభివృద్ధిలో గ్రామానికి కావలసిన సౌకర్యాలను అందించుటలో ప్రజలను గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ, గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించి, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నేరేడుపల్లి గ్రామ సర్పంచుగా. ఆకుతోట రాజేష్. ఉత్తమ అవార్డు సాధించడం సంతోషం అన్నారు.
గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో పోటీతత్వం పెంచేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రోత్సాహకాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గండ్ర దంపతుల సలహా సూచనలు పాటిస్తూ వారు అందించిన నిధులతో నేడు అభివృద్ధి పథంలో మా గ్రామం దూసుకుపోతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుతోట సమ్మిరెడ్డి, బొమ్మన రమేష్, శివారెడ్డి. డోలె రాజు గారు, మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగారు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page