SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బర్ల కుంట చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి నిర్మాణం పనులను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
బర్ల కుంట చెరువు కు త్వరలోనే మహర్దశ కలుగుతుంది అని, చెరువు ను సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, చెరువు సుందరికరణ పనులు చేపట్టి సుందర వనం శోభితం వనంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని,ఆహ్లాదకరమైన ,స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతామని ,చెరువు సుందరికరణ మరియు త్వరలోనే అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టి అదేవిధంగా చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .

ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.