బతుకమ్మ పండుగకు సంబంధించి చిత్రీకరించిన బతుకమ్మ పాట

Spread the love

Bathukamma song filmed in relation to Bathukamma festival

సాక్షిత : బతుకమ్మ పండుగకు సంబంధించి చిత్రీకరించిన బతుకమ్మ పాటను ముఖ్య అతిధిగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ యూట్యూబ్ లో విడుదల చేశారు

తెలంగాణ సాంస్కృతిని సంప్రదాయానికి నిలువెత్తు రూపం అయినా బతుకమ్మ పండుగకు సంబంధించి చిత్రీకరించిన బతుకమ్మ పాటను తన నివాసంకి విచ్చేసిన సురభి కళాకారుల సమక్షంలో యూట్యూబ్ లో విడుదల చేయడం ఆనందంగా ఉందని వారు చిత్రీకరించిన పాట ఎంతో బాగుందని తెలిపారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

ఈ సందర్బంగా బతుకమ్మ పాటను చిత్రించిన యూనిట్ రచన-సంగీతం వి. సత్యశ్రీనాథ్, సింగర్ భాస్కర్, ఫిమేల్ సింగర్ వి.రేఖ,Dop శ్రీమహావిష్ణు,లకు శుభాకాంక్షలు తెలిపి అభినందిచారు. రానున్న రోజుల్లో మరెన్నో పాటలను చిత్రీకరించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. స్థానిక కళాకారులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తామని, ప్రోత్సహిస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో సురభి కాలనీ తెరాస బస్తీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, గోపాల్ యాదవ్, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page