
అయ్యప్ప స్వామి ట్రస్ట్ వారి అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించిన
మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని..
చిలకలూరిపేట : మహాశివరాత్రి సందర్భంగా పురుషోత్తపట్నం అడ్డరోడ్డు నుండి కోటప్పకొండకు వెళ్ళు భక్తులందరికీ అయ్యప్ప స్వామి ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి అల్పాహార కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్రమైన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది శివుని దర్శనం కోసం శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు అని తెలిపారు.
ఏటా జరిగే ఈ మహోత్సవంలో మానవ సేవా మాధవ సేవగా పట్టణంలో ఉన్న వివిధ సేవ సంస్థలు, కొట్టప్పకొండకు వచ్చే భక్తుల కోసం అల్పాహార కేంద్రాలు ,అన్నదాన కార్యక్రమలు నిర్వహించటం ఆనవాయితీ గా వస్తుందని భక్తి భావం, సేవా భావాన్ని మించిన ఆత్మ సంతృప్తి మరొకటి ఉండదని మహాశివరాత్రి సందర్భంగా అయ్యప్ప స్వామి ట్రస్ట్ నిర్వాహకులు విజయ్ కుమార్ కి ట్రస్టు సభ్యులకు అలాగే అన్నదాన కార్యక్రమాలు అల్పాహారా కేంద్రాలు ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రజల పైన ఉండాలని సర్వేశ్వరుని వేడుకుంటున్నట్లు తెలియజేసి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ నిర్వాహకులు చల్ల.విజయ్ కుమార్ గారు మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app