SAKSHITHA NEWS

వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన వారికి పురస్కారాలు

మార్చి నెల 15 న విశాఖ లో జరిగే ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన సంస్థ లకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్సుమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా, వైద్యం , ఆర్థిక, స్థిరాస్తి…తదితర రంగాల్లో వినియోదారులకు ఉత్తమ సేవలదించిన పలు సంస్థ లకు ఉత్తమ సేవా పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా సంస్థలు వినియోగ దారులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు రావాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు….ముఖ్యంగా యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app