SAKSHITHA NEWS

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పిజెఆర్ — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద పి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు తెలిపిన శ్రీశైలం గౌడ్ …

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… పిజెఆర్ కార్మిక నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… అనునిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు పిజిఆర్ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వారి సేవలను గుర్తు చేసుకున్నారు…

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగు నూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగు నూరి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ ఎం రాము గౌడ్, మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, మాజీ సర్పంచ్ యాదగిరి, ముత్యం రెడ్డి, పరశురాముల గౌడ్, కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, కోటీశ్వరరావు, సదానంద్, రాహుల్, విజయ్ గౌడ్, సురేష్, వెంకట్ రెడ్డి, మురళి, నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..