
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు పోచారం శివరాజ్ గౌడ్ గారి అమ్మగారు పోచారం సావిత్రమ్మ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పీఏసీ చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి సావిత్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, కొండారెడ్డి, ఉమేష్, విష్ణువర్ధన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, ఆంజనేయ ప్రసాద్ గౌడ్, విఠల్ గౌడ్, హరి ప్రసాద్, సౌందర్య, అమృత, ఉమామల్లిక, లావణ్య, లక్ష్మీ, రాజేశ్వరి, భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.
