SAKSHITHA NEWS

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా తనను ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్ కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, శాసనసభలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేస్తాను” అని పేర్కొన్నారు.

అలాగే, పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, పార్టీ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app