Read Time:59 Second
ఆ సమయంలో నాలాంటి అన్న పక్కన ఉంటే..: సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం: మహిళలను వేధిస్తే తాను చూస్తూ ఊరుకోనని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళంలో దిశ యాప్ డౌన్లోడ్ డ్రైవ్ కార్యక్రమంలో నిన్న నిర్వహించిన సభలో అప్పలరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళల్ని వేధించే సమయంలో నాలాంటి అన్న పక్కన ఉంటే కోసి కారం పెడతాడని సీదిరి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు

