ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐపిఈఆర్ స్థాపనకు ఏమైనా ప్రతిపాధనలున్నాయా

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐపిఈఆర్ స్థాపనకు ఏమైనా ప్రతిపాధనలున్నాయా

పార్లమెంట్ ప్రస్నోత్తరాల సమయంలో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ
సాక్షిత : ప్రస్తుతం దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌ల సంఖ్య ఎంత, ఔషధ విద్య, పరిశోధనలకు ఊతమిచ్చేందుకు దేశవ్యాప్తంగా మరిన్ని క్యాంపస్‌లను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా అలా అయితే దాని వివరాలు ఇవ్వగలరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఔషధ పరిశ్రమను పరిగణనలోకి తీసుకుని ఎన్ఐపిఈఆర్ స్థాపించడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అలా ఉన్నట్లయితే దాని వివరాలు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల శాఖా సహాయ మంత్రి భగవంత్ ఖుభా బదులిస్తూ

దేశంలో పంజాబ్ లోని మొహాలీ, గుజరాత్ లోని అహ్మదాబాద్,తెలంగాణ లోని హైదరాబాద్, అస్సాం లోని గౌహతి, ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలి, బీహార్ లోని హాజీపూర్ మరియు పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత తో కలిపి మొత్తం ఏడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పారు.

ఇప్పటికే ఉన్న ఎన్ఐపిఈఆర్ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను బలోపేతం చేయడం ప్రారంభించబడిందని మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతానికి వాయిదా వేయబడిందన్నారు.

ఆలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రస్తుతానికి ఎన్ఐపిఈఆర్ ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఇప్పటికే ఉన్న ఏడు ఎన్ఐపిఈఆర్ లకు అడ్మిషన్లు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతాయని ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశం నలుమూలల నుండి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన చెప్పారు.

Related Posts

You cannot copy content of this page