
ఈ నెల 18న చంద్రబాబు ఇంటికి వెళ్తున్న అమిత్ షా
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న అమిత్ షా
అమిత్ షాకు హైలెవెల్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు
19న దావోస్ కు బయల్దేరుతున్న చంద్రబాబు
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువైన నేపథ్యంలో… రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంతి అమిత్ షా ఏపీకి వస్తున్నారు. ఈ నెల 18న అమిత్ షా ఏపీకి వస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధికారికంగా ప్రకటించింది.
తన పర్యటనలో భాగంగా… ఈ నెల 18న (శనివారం) అమిత్ షా ఏపీకి చేరుకుంటారు. ఆ రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అవుతారు. అమిత్ షాకు చంద్రబాబు హైలెవెల్ డిన్నర్ ఇవ్వబోతున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు.
19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు దావోస్ పర్యటనకు బయల్దేరుతారు.
