SAKSHITHA NEWS

కేతనకొండ లో పలు అభివృద్ధి పనులకు మండలపరిషత్ నిధులు కేటాయింపు

మూడు గ్రావెల్ రోడ్లకు గాను 8 లక్షల రూపాయల కేటాయింపు

ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు రహదారుల అభివృద్ధి కోసం మండల పరిషత్ నిధుల నుండి 8 లక్షల రూపాయలను కేటాయించినట్లు ఎంపీపీ పాలడుగు జోత్స్న తెలియజేశారు. కేతనకొండలోని నిధులు కేటాయించిన రోడ్లను బుధవారం పరిశీలన కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోకులం కార్యక్రమ ప్రారంభానికి ముఖ్య అతిథిగా కేతనకొండ విచ్చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి, స్థానికులు,స్థానిక మహిళలు రోడ్లు సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేయడంతో,

ఆ కార్యక్రమంలో ప్రక్కనే ఉన్న ఎంపీపీ పాలడుగు జోత్స్న కు మండల పరిషత్తు నిధులనుండి నిధులను కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించినట్లు తెలిపారు.వెంటనే ఎస్టిమేట్లు రెడీ చేయించి 8 లక్షల రూపాయలను గ్రామంలోని మీరా కాలనీ రోడ్డుతో పాటు మరో రెండు రోడ్ లకు కూడా గ్రావెల్ రోడ్లుగా అభివృద్ధి పరచడానికి గాను మండల పరిషత్తు నిధుల నుండి కేటాయించడం జరిగిందని తెలిపారు.శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకే నిధులను తక్షణమే కేటాయించామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్,కేతనకొండ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మూరి గోపాలరావు,పత్రి చలపతి మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.