అగ్రిగోల్డ్ బాధితులకు రెండవ విడత నగదు జమ
సాక్షిత : ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు 2వ విడత నగదు జమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు*
అగ్రిగోల్డ్ స్కామ్‌కు గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియ అని విమర్శించారు మినిస్టర్ డాక్టర్ సీదిరి
చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే కష్ట జీవులను సైతం చంద్రబాబు సర్కార్ మోసం చేసిందన్న డాక్టర్ సీదిరి
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి డాక్టర్ సీదిరి స్పష్టం చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని ఈరోజు విడుదల చేశారు. రెండో విడతలో 10 వేలలోపు డిపాజిట్‌దారులకు 208 కోట్లు, 20 వేల లోపు డిపాజిట్‌దారులకు 459 కోట్లను జమ చేశారు. ఇవాళ ఒక్క రోజే 7 లక్షల మందికి తాము కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం పది లక్షల 40 వేల మందికి 905 కోట్లను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని తెలిపారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని మంత్రి ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలెవరికీ నష్టం కలగదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు తో పాటు జిల్లా కలెక్టర్, స్పీకర్ తమ్మినేని సీతారాం , ఎమ్మెల్యే కంబాల జోగులు , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ,కళింగ కార్పోరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ , కాపు కార్పోరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.