చిన్నతనంలోనే అమ్మకోసం యూట్యూబర్ గా మారిన యువకుడు

Spread the love

ఇంట్లో కష్టాలను చూసి ,అమ్మానాన్నలకు అండగా మారి ,చిన్నతనంలో పెద్ద బాధ్యతలను మీద పెట్టుకున్న సీతానగరం చైతన్య !!!
వృద్ధాప్యం లో ఉన్న తల్లితండ్రులను వదిలి వలస వెళ్లి ,కన్న తల్లి, తండ్రులను మర్చిపోయి బ్రతుకుతున్న ఈరోజుల్లో, వారందరికీ చైతన్య జీవితం ఒక ఆదర్శం.
అమ్మ,ననాలకోసం తన జీవితాన్ని మార్చుకున్న యువకుడు.
తూర్పు గోదావరి జిల్లా ,సీతానగరం మండలం ,వేలంపేట గ్రామం లో మైలపల్లి చైతన్య అనే యువకుడుకి 22 సంవత్సరాలు , చీన్నఅప్పటి నుండి గవర్నమెంటు స్కూల్ లోనే చదువుకున్నాడు.

తనకి ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. తాను ఇంటర్ లో ఉన్నప్పటి నుంచి తనకున్న మొబైల్ లోనే ఎడిటింగ్ నేర్చుకొనే వాడు, ఇంటర్ లో ఉన్నప్పుడే యూట్యూబ్ “Chaitu Editz” పేరు తో ఒక ఛానల్ స్టార్ట్ చేసాడు. చాలా మంది తనని చులకనగా చూడడం వీడియోస్ లో పిచ్చి వాడిలా మాట్లాడుతున్నాడు అని హేళన చేసేవారు.ఇంట్లో ఎక్కువ సమయం మొబైల్ తో ఉండేవాడిని ఇంట్లో వాళ్లు ఎక్కువ టైం మొబైల్ తో ఉంటున్నానని తిట్టేవారు. కానీ తాను చేస్తుంది యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నాని ఎడిటింగ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి తెలీదు ఎందుకంటే వారి అమ్మ నాన్నపెద్దగా చదువుకోలేదు. అయినా తాను ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకొనేవాడు, డిగ్రీ చదువుకున్న టైం లోనే
ఔట్ సైడ్ ఫోటో షూట్స్ పెళ్లిళ్లు, ఈవెంట్స్ కి ఫొటోస్ వీడియోస్ తీసే వాడు.అలాగే షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివన్నీ తీసేవాడు. అప్పటికి తనకు యూట్యూబ్ లో (3000) మూడువేల సబ్స్క్రైబ్ఎర్స్ ఉండేవారు..డిగ్రీ అయిపోయిన సమయం లో ఫిల్మ్ ఇండస్ట్రీ లో బషీర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ కి Thumbnails థంబ్నెయిల్ చేసేవాడు.డిగ్రీ అయినా తరువాత బషీర్ మాస్టర్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ దగ్గర ,ఆయన ఛానల్ ఎడిటింగ్ చెయ్యడానికి అవకాశం వచ్చింది. హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర నాలుగు నెలలు వర్క్ చేసాడు. తరువాత అక్కడ తనకి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటం తో మరల తన స్వగ్రామం అయిన సీతానగరం వెలపేట కి తిరిగి వచ్చాడు , గురువు రాకేష్ మాస్టర్ గారి యొక్క స్ఫూర్తి తో మరియు వారు నేర్పిన కొన్ని జీవిత పాఠాలు చైతన్య జీవితాన్ని మార్చేశాయి.తరువాత ఇంకా ఎడిటింగ్ బాగా నేర్చుకొని తానే సొంతగా యూట్యూబ్ పై మక్కువతో యూట్యూబర్ కి వర్క్ చేసాడు. ఆంధ్ర, తెలంగాణ లో ఉండే కొంతమంది యూట్యూబర్స్ కి అలాగే కెనడా, అమెరిక, బ్యాంకాక్, చైనా,జర్మనీ కెన్యా, బహ్రెయిన్, వంటి దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళకి యూట్యూబ్ Related రిలేటెడ్ వర్క్ చేస్తున్నాడు. అలాగే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తాను సంపాదించుకున్న డబ్బులతోనే కంప్యూటర్, బండి కొనుకున్నాడు. ఇప్పుడు తన ఛానల్ కి (10,000) పదివేల subscribers సబ్స్ క్రిబర్స్ ఉన్నారు.. అందరికీ వర్క్ చేసి నెలకు తాను బాగా సంపాదించుకొని అమ్మ నాన్న దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటున్నాడు,ఇతని యొక్క తల్లిదండ్రుల సేవకు గ్రామ ప్రజలు మెచ్చి తనకు సన్మానం చేయడం జరిగింది .తన వులుర్లోనే కాదు తూర్పు గోదావరి జిల్లా లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు చైతన్య .అమ్మనాన కోసం ఈరోజు ఒక గొప్ప స్థాయికి వెళ్లిన యూట్యూ బర్ చైతన్య నీ ఫిల్మ్ ఇండస్ట్రీ వారు కూడా గుర్తించి చిత్రపరిశ్రమ వారు కూడా అవకాశాలు ఇస్తామని , ఇపుడు ముందుకొస్తున్నారు.చైతన్య జీవితo అందరికి ఒక జీవిత పాఠం లాంటిది అని గ్రామ ప్రజల మెప్పు పొందాడు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page