
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సాక్షిత :శంషాబాద్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్,మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!
దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి,తెలంగాణ రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ (జంగయ్య)యాదవ్,మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్,మేడ్చల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!
*రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రూ 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించారని ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు.సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ నిధులను రాబట్టడంలో విజయవంతమయ్యారన్నారు.
దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్టుగా చెప్పారు.దావోస్ పర్యటనతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా,పరోక్షంగా 49,500 ఉద్యోగాలు కూడా వస్తాయని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కౌడే మహేష్ కురుమ,మర్రి శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న సంతోష్ గౌడ్,చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్,ఘనపూర్ మల్లేష్ మేడ్చల్ మున్సిపాలిటీ,ఉమ్మడి మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app