SAKSHITHA NEWS

రికార్డుల మోత.. రివార్డుల బాట..

ఏడాదిలో రూ. 11 కోట్ల మేర గంజాయిని పట్టుకున్న కామ ఎక్సైజ్ పోలీసులు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్న క్యాష్ రివార్డులు ప్రశంసాపత్రాలు..

హైదరాబాద్ ఆప్కారి భవన్ లో ప్రధానం చేయనున్న డైరెక్టర్.

అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఖమ్మం కొత్తగూడెం ఎక్సైజ్ యంత్రాంగం పనితీరుకు అద్దం పట్టినట్లు గా ఉంది.

తెలంగాణలో మొత్తం ఎక్సైజ్ శాఖలు 2024 సంవత్సరంలో 6000 కేజీల గంజాయిని పట్టుకుంటే ఒక ఖమ్మం ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టు పట్టుకుని తమ సత్తా చాటారు..

ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టుకోవడంలో టాప్ గా నిలిచారు .

గంజాయితోపాటు 16,435 కేజీల బెల్లం 500 కేజీల ఆలయం కూడా పట్టుకుని తమ రికార్డులను వారి బ్రేక్ చేసుకున్నారు.

పనితీరు లో నైపుణ్యం కనపరచినటువంటి ఎక్సైజ్ యంత్రాంగానికి హైదరాబాదులోని ఎక్సైజ్ భవన్ లో ప్రతిభ కనబరిచిన వారికి కాష్ రివార్డులు ప్రశంసాపత్రాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందించనున్నారు.

2024 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 25 వరకు 35 కేసుల్లో ఈ రికార్డులను ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు సాధించారు.

ఖమ్మం జిల్లాలో భద్రాచలం పాల్వంచ అశ్వరావుపేట కొత్తగూడెం ఎక్సైజ్ పోలీసుల మొత్తం 35 కేసుల్లో భారీగా గంజాయిని బెల్లాన్ని పట్టుకోవడం పట్ల పట్టుకోవడంతోపాటు 35 వాహనాల్లో 11 కార్లను స్వాధీనం చేసుకున్న ఘనత కూడా భద్రాచలం ఎక్సైజ్ పోలీసులకే దక్కింది.

ఈ ఎక్సైజ్ పోలీసుల సేవలను గుర్తించినటువంటి డైరెక్టర్ నేడు వారందరికీ ప్రశంసాపత్రాలను అందించనున్నారు. కానిస్టేబుల్ నుంచి అన్ని స్థాయిలో యంత్రాంగానికి ఈ క్యాష్ అవార్డులు ప్రశంస పత్రాలు అందించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app