దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి

Spread the love

జోగుళాంబ గద్వాల్ పోలీస్

దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి

రోడ్డు ప్రమాదల నివారణకు ప్రత్యేక చర్యలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ——– జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

జిల్లా లో నమోదు అవుతున్నా అయా కేసులలో అధికారులు పకడ్బదీగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని, అందుకు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ కె.సృజన పోలీస్ అధికారులకు తెలియజేశారు.

జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరం లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.
అందులో బాగంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, UI కేసులను అడిగి పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను
ఆదేశించారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ తమ పరిదిలో జరిగే నేరాల లో పకడ్బదీగా విచారణ చేసి నిందితుల పై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కేసులు విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని,ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతి కేసు విచారణలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టాలని, పార్ట్-1, పార్ట్-2 స్టేట్మెంట్ రికార్డ్,CDF ఫీల్ చేయుట, పోటో స్ , ప్రాపర్టీ సీజ్, నిందితుల వివరాలు ఎంట్రి చేయట, రిమాండ్ డైరీ చార్జి షీట్ ఫీల్ చేయుట తదితర అంశాల పై ఆయా కేసులలో ఫైల్ లను పరిశీలించి SHO లకు తగు సూచనలు చేశారు.


ప్రస్తుత కాలంలో ప్రజలు రోడ్డు ప్రమాదలకు ఎక్కువ గా గురవుతున్నారు. అందుకు వారికి రోడ్డు నియమాలు, రోడ్డు సేఫ్టీ గురించి కళా బృందo ద్వారా ట్రాపిక్ నియమాల పై అవగాహనా కల్పించాలని అన్నారు. ఇప్పటికే జిల్లా లో గుర్తించిన హాట్ స్పాట్స్ లలో ప్రమాదాలు జరుగుకుండ R &B వారితో మాట్లాడి అవసరమైన సిగ్నల్, ఇతర మార్పులు చేర్పులు చేపట్టాలని సూచించారు. ఎస్సై లు తప్పని సరిగా గ్రామాలను సందర్శించాలని, ప్రతి శనివారము పరెడ్ నిర్వహించి సిబ్బందితో మీటింగ్స్ ఎర్పాటు చేసి విధుల పట్ల ఎలా ముందుకు వెళ్ళాలో సూచనలు చేయాలనీ అన్నారు. ప్రతీ వారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించాలని అధికారులను అదేశించారు. పోలీస్ స్టేషన్ లలో ఉన్న అబాండెడ్ వాహనాలను వేలానికి సిద్దం చేయాలనీ అదేశించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను ఖచ్చితంగా పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు వారికి తగు సూచనలు చేయాలని అదేశించారు. ఓ. ఈ లు ఎవరు కుడా పెండింగ్ లో ఉంచుకోవద్దు అని, ఆయా వర్టికల్ కు సoబందించి సిబ్బంది పనితీరును రోజు వారిగా సమీక్షించుకోవాలని ఎస్సై లకు సూచించారు. ప్రాపర్టీ నేరాల పై నిఘా ఉంచి దృష్టి సాధించాలని అన్నారు.


నేరాల నియంత్రణలో చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 5S విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని,ఫైళ్లను క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు.
అనంతరము పోలీస్ వాహనాలను జిల్లా ఎస్పీ ఇన్స్పెక్షన్ చేశారు. పోలీస్ వాహన డ్రైవర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మెకానిజం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తించే సమయంలో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన వాహనాన్ని ప్రతిరోజు శుభ్రపరుస్తూ కండిషన్ లో ఉంచుకోవాలని సమయానికి ఆయిల్ సర్వీసింగ్ చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండి సైన్ బోర్డ్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మోటార్ వాహనాల యెక్క మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన కల్పించడంతో పాటు తరచి వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేయాలనీ ఏం.టి. ఓ అర్. ఐ నగేష్ కి సూచించారు.

ఈనెల సమీక్షా సమావేశంలో డి.ఎస్పి శ్రీ ఎన్. సి హెచ్ రంగ స్వామి , కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్ , సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనీయోల్ , ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్ , డీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్ , అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ , శ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, డీసీఆర్బీ, సిబ్బంది, ఐటీ సెల్, సిబ్బంది ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page