SAKSHITHA NEWS

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందంఅమరావతీ :

అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణులు ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి.

అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు రెండు రోజులు పరిశీలించనున్నారు.


SAKSHITHA NEWS