మైనార్టీల అభ్యున్నతికి పెద్ద పీట

Spread the love

మైనార్టీల అభ్యున్నతికి పెద్ద పీట
రంజాన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షిత పటాన్చెరు : రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని రూపొందించిన క్యాలెండర్ ను సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులపాటు కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ నిర్వహించే పవిత్ర మాసం రంజాన్ మాసం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం తరఫున నిరుపేద ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా నిర్వహించుకునేందుకు ప్రతి సంవత్సరం నూతన వస్త్రాలు అందిస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో నూతన మసీదులు, ఈద్గాలు, ఆశిర్ఖానాలు నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page