Workers are the leaders of the party: MP Nama
కార్యకర్తలే పార్టీకి సారధులు : ఎంపీ నామ
నామ సమక్షంలో బీఆర్ ఎస్ లో యువకులు చేరిక
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలి : నామ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. దమ్మపేట మండలం నల్లకుంటకు చెందిన 25 మంది యువకులు దమ్మపేట మండలం మందలపల్లి కి చెందిన దిశ కమిటీ సభ్యులు , పార్టీ నాయకులు గారపాటి సూర్యం నాయకత్వంలో శనివారం ఖమ్మం లోని నామ స్వగృహంలో ఎంపీ నామ నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపి నామ వారికి పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని వారే పార్టీకి పునాదులు, సేనాధిపతులని అన్నారు.దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పథకాలు అమలు చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీని స్థాపించారని, పార్టీని మరింత బలోపేతం
చేసేందుకు ప్రతి ఒక్కరూ శమటోడ్చి పని చేయాలని అన్నారు. ఉన్నత విద్య నభ్యసించిన వారు సైతం నేడు తన సమక్షంలో పార్టీలో చేరారని అన్నారు.
సీఎం కేసీఆర్ అద్భుతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసికెళ్లాలని నామ పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారని, వారికి మనమంతా అండగా ఉండి, కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు.నామ సమక్షంలో పార్టీలో చేరిన వారిలో ప్రముఖ విద్యావంతుడు,న్యాయవాది సోడెం వెంకట్, అద్దంకి మధు (లెక్చరర్) కనపర్తి ధర్మారావు, సీహెచ్ భాగ్యరాజు, నందికోల రామారావు,
మద్దెల పుల్లారావు,ఐనంపూడి సంతోష్, ఎడవల్లి కుమార్, తోట గోపి తదితరులు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు, కేసీఆర్ సుపరిపాలన నచ్చి బీఆర్ ఎస్ లో చేరామని చెప్పారు.కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, గోడ్డేటి మాధవరావు, మోరంపూడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.