SAKSHITHA NEWS

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఎక్కువగా ఉందని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి ఎంటోమొలజి సిబ్బందితో కలిసి ఎల్లమ్మచెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల నివారణ మందులు పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి బస్తి పరిశుభ్రంగా ఉండేట్లు చూస్తున్న అని, ఈ విషయంలో ఎంటోమొలజీ సిబ్బంది పనితీరును మెచ్చుకోవలని అన్నారు. ఆలాగే ప్రజలు కూడా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని చెరువులలో గాని వేయవొద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్. శివరాజ్ గౌడ్, మోజెస్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, మహేష్, సంతోష్, ఎంటోమొలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటోమొలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS