మియాపూర్ డివిజన్ పరిధిలోని హై టెన్షన్ లైన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన Train Your Self మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెంటర్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ Train Your Self మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెంటర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎనతగానో తోడ్పడుతుంది అని, ఇక్కడి ప్రాంత యువత మార్షల్ ఆర్ట్స్ ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలని,ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో తోడ్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినదించారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కృష్ణ రావు కాశినాథ్ యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు