సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న , MRO వంశీ మోహన్ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , మాదాపూర్ డీసీపీ శ్రీమతి పుష్ప వల్లి , ఏసీపీ రఘునందన్ రావు , ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు , సిఐ సురేష్ , మాజీ కార్పోరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేసిన
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ను పోలీస్ అధికారులు, ఐటీ మిత్రులు, స్థానిక ప్రజలతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రజలు ఎక్కడున్నవారు అక్కడ నిలబడి జనగణమన ఆలపించారు. ఇండ్లు, ఆఫీసులు, రోడ్ల పై జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ దేశభక్తి ని చాటారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలనే మహా సంకల్పంతో భారత స్వాతంత్ర్య సమరంలో భాగంగా ‘డు ఆర్ డై’ అనే నినాదంతో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని గుర్తుచేసుకుంటు,ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరమున్నదన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేనురోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఎందరో మహానుభావుల త్యాగపలం స్వతంత్ర భారతం అని , మహానియులను స్మరించుకోవడం మన విధి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అని అదేవిధంగా ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
ఇంటి ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురావేసి, స్వతంత్ర భారత కీర్తిని నలుదిశలా చాటాలని, అన్నారు. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకోని వెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా మన భారత దేశం అడుగులు వెయ్యటంలో ప్రతి భారతీయుని పాత్ర ఉండాలని అన్నారు. ఏ దేశమేగిన, ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్నీ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని భారతదేశ ఖ్యాతిని పెంచాలని కోరారు. సర్వమత సమ్మేళనంగా ముందుకు భారతీయులు కదిలి, దేశ అభివృద్ధికి తోడ్పాడాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, నరేష్, సురేందర్, జగదీష్,మల్లేష్, వినోద్,రమేష్, సల్లావుద్దీన్, అక్బర్,అంజమ్మ,గోవింద్, నవాజ్, నర్సింహ రాజు,శ్రీనివాస్,నారాయణ, నగేష్, అశోక్, మహాదేవప్ప, అమర్, సుధీర్ ,భిక్షపతి, సుగుణ ,బాలమణి మరియు పోలీస్ సిబ్బంది, ఐటీ మిత్రులు, ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు,, తెరాస నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు