SAKSHITHA NEWS

రైస్ పుల్లింగ్ పేరుతో ప్రభుత్వ మహిళా టీచర్ ఘరానా మోసం…..కోటిన్నర స్వాహా చేసిన వైనం!

కడప జిల్లా

ప్రొద్దుటూరునియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ టీచర్ శోభారాణి తన దూరపు బంధువు ఆయన బెంగళూరుకు చెందిన అపర్ణతో ఓ భారీ మోసానికి తెరలేపింది.

దువ్వూరుకు చెందిన మూల వెంకటరమణారెడ్డి అనే వ్యక్తిని నమ్మించి మోసం చేశారు.

విడతల వారీగా ఆయన వద్ద నుంచి దాదాపు రూ.కోటి 37 లక్షల రూపాయలను తీసుకుని మోసం చేశారు.

రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని అష్టైశ్వర్యాలు సకల సంతోషాలు కలుగుతాయని, చాలామంది ధనవంతుల దగ్గర అలాంటి పాత్రలు ఉండడంతో వారు కోట్లు సంపాదిస్తున్నారని వెంకటరమణారెడ్డిని నమ్మబలికించి మోసం చేశారు.

అయితే అలాంటి వస్తువు వారి దగ్గర ఏమీ లేదని వెంకటరమణారెడ్డి తెలుసుకునే లోపే వారు ఈ మోసానికి ఒడిగట్టడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన అపర్ణతో పాటు మరో ముగ్గురిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐ యుగంధర్ మీడియాకు వెల్లడించారు.


SAKSHITHA NEWS