SAKSHITHA NEWS

మహబూబ్నగర్ రైతు పండగ సంబరాల సదస్సుకు అన్ని ఏర్పాట్లు* చేయాలని అధికారులను ఆదేశించిన…………… జిల్లా
కలెక్టర్ ఆదర్శ సురభి
*
సాక్షిత వనపర్తి :

నవంబర్ 30న మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండగ సంబరాల సదస్సుకు జిల్లా నుంచి బయలుదేరే రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

      కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి రైతు పండుగ సంబరాలకు తరలి వెళ్లే రైతులకు చేయాల్సిన ఏర్పాట్లపై  సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 

     కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30న మహబూబ్నగర్లో నిర్వహించే రైతు పండుగ సంబరాలకు సీఎం ఏ రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, సదస్సుకు బయలుదేరే రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామాల నుంచి రైతులు బయలుదేరేందుకు బస్సులో ఏర్పాటు చేయాలని, వారికి ప్రయాణానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇందుకోసం ఎంపీడీవోలు, ఎంఏవోలు నోడల్ అధికారులుగా ఉంటారని ఆదేశించారు. రైతులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, సదస్సును విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

  సమావేశంలో జెడ్పిసిఓ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి,   డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఆర్టీసీ డిఎం, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS