
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేకాకర్షణగా నిలచిన పోలీస్ బలగాల కవాతు.ప్రశంచించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు పరెడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని,పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు , మరియు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
★ ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు.
★ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లు కలసి పల్నాడు జిల్లా DAR మరియు హోంగార్డు మరియు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సాదినేని కృష్ణ సారథ్యంలో నిర్వహించిన పోలీస్ బలగాల కవాతును వీక్షించి,తదుపరి కవాతులో పాల్గొన్న బలగాలను ప్రత్యేక వాహనం ద్వారా పరిశీలించారు.
★ నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,గుండెల నిండా దేశభక్తి నింపుకుని,సగర్వంగా తలలు పైకెత్తి భరతమాత గొప్పదనాన్ని చాటిచెప్పుతూ,ప్రజల స్వేచ్ఛ మరియు స్వతంత్ర్యాలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపే విధంగా సాగిన పోలీస్,NCC మరియు స్కౌట్స్ బలగాల కవాతు చూపరులను ఆకట్టుకుంది.
★ గణతంత్ర వేడుకలలో ప్రత్యేకాకర్షణగా నిలచిన పోలీస్ బలగాల కవాతును మెచ్చుకుని,కవాతు సారధి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ ని,కవాతు పర్యవేక్షకుడు ఏఆర్ ఇన్స్పెక్టర్ సాదినేని కృష్ణ ని, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లు ప్రత్యేకంగా అభినందించి, కవాతులో పాల్గొన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసినారు.
★ తదనంతరం జిల్లా కలెక్టర్ బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళ నుండి భారత దేశం స్వాతంత్ర్యం పొంది గణతంత్ర రాజ్యాంగా అవతరించడానికి కృషి చేసిన నాటి వీరుల త్యాగాల గురించి,వారి ఆశయాల గురించి వివరించి,వారి ఆశయాల నెరవేర్పునకై మన కర్తవ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
★గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు జాగిలాల ప్రదర్శన అబ్బుర పరిచింది. వివిధ పాఠశాలల విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతమూ అహ్లాదపరిచాయి
★ తదనంతరం ఆయా ప్రభుత్వ శాఖల వారు ఏర్పాటు చేసిన శఖటాల ప్రదర్శనను తిలకించిన అనంతరం,ఆయా శాఖలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ , ఎస్పీ,నరసరావు పేట 13th అడిషనల్ జడ్జి సత్యశ్రీ లతో పాటు జిల్లా అదనపు ఎస్పీలు JV సంతోష్ , V. సత్తిరాజు ,లక్ష్మీపతి , ఇతర పోలీస్ అధికారులు,ప్రభుత్వ అధికారులు,సిబ్బంది,వివిధ పాఠశాలల విద్యార్ధిని, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app